పెయ్య దూడల ఉత్పత్తి పధకాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలని మండల పశు వైద్యాధికారి వి ప్రతాప్ రెడ్డి కోరారు. తురకపాలెం గ్రామంలో మంగళవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రభుత్వం పెయ్య దూడల పుట్టె వీర్య నాళికలను సబ్సిడీ లో రూ. 150కే అందజేస్తున్నట్లు చెప్పారు. పశువుల భీమా పథకాన్ని 85 శాతం రాయితీ తో భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎదకు రాని దూడలను పరిశీలించి మందులు అందించారు. 76 దూడలకు, 1300 జీవాలకు, 159 పెద్ద పశువులకు నట్టల నివారణ మందులు తాగించారు. 42 మంది పాడి నన్న జీవాల రైతులకు పంపిణీ చేసారు. ఎ హెచ్ఎ కొండలు ఇతర పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
