యూరియా పంపిణీ నక్రమంగా జరిగేలా క్షేత్ర స్థాయిలో విఏఏలు చూడాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. తాళ్లూరులో బుధవారం మన్నేపల్లి, నాగంబొట్ల పాలెం సొసైటీలకు, శివరామపురం, తాళ్లూరు, మల్కాపురం ఆర్ ఎన్ కే లకు 58 మెట్రిక్ టన్నుల యూరియా రావటంతో రైతులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో వ్యవసాయాధికా ప్రసాద రావు ఆయా కేంద్రాలను సందర్శించి రైతులకు అవసరమైన మేర యూరియా ఉందని, అవసరమైన వారు మాత్రమే తీసుకువెళ్లాలని సూచించారు. విఏఏ ‘ సాయి, అశోక్, వెంకట రాజా లు పాల్గొన్నారు.

