ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులకు పట్టవా….ప్రభుత్వం ఉచితం అన్నా అమలు కానీ కరెంటు బిల్లుల్లు.వేలకు వేలు బిల్లులు…పరేషాన్ అవుతున్న ప్రజలు..రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న. వారికి ఇంటి పన్ను చెల్లించాలంటూ ఇబ్బంది పెడుతున్న బోర్డు సిబ్బంది…ప్రజా ప్రతినిధులు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలంటూ జంపన డిమాండ్.

కంటోన్మెంట్ జనవరి 22
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులకు పట్టవా,పేదలకు
ప్రభుత్వం ఉచితం అన్నా కరెంటు బిల్లుల్లు కంటోన్మెంట్ పరిధిలోని పలు బస్తీలలో. అమలు కావడం లేదంటూ కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ డిమాండ్ చేశారు.ప్రజలు పడుతున్న ఇబ్బందులను గాలికి వదిలి వేయడం ఏమిటని ఆయన నిలదీశారు.
వేలకు వేలు బిల్లుల తో ప్రజలు పరేషాన్ అవుతున్నారన్నారు. మాలిని కాలనీ,వనిత కాలనీ,బాపూజీ నగర్ తో పాటు వివిధ బస్తీలలో ఉన్న విద్యుత్ బోర్లకు కంటోన్మెంట్ అధికారులు విద్యుత్ కట్ చేస్తున్నారని.కొన్ని బస్తీలలో ఉన్న బోర్లలో కొన్నింటికి విద్యుత్ కట్ చేయడంతో ఆయా బస్తీల ప్రజలునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.స్వర్ణభారతి ,వనిత కాలనీ,సంచార పూరి,పబ్లిక్ సెక్టార్ లలో డ్రైనేజ్,మ్యాన్ హోల్స్ సమస్యలు ఉన్నాయన్నారు.
ఇటీవల చేపట్టిన
రోడ్డు విస్తరణలో రోడ్డుకు ఇరు వైపుల ఇళ్లను కోల్పోతున్న. వారికి రూ 10000లు ఉంటే 3రెట్లు ఎక్కువ ఇంటి పన్ను చెల్లించాలంటూ బోర్డు సిబ్బంది ఇళ్లు కోల్పోతున్న వారిని నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని జంపన ప్రశ్నించారు. వారు నివాసం ఉంటున్న ఇళ్లను కోల్పోతుంటే పన్నుల బకాయిలు ఎలా చెల్లిస్తారని ప్రజా ప్రతినిధులు కంటోన్మెంట్ లోని వివిధ బస్తీలలో ఎదుర్కొంటున్న
ఈ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలంటూ జంపన ప్రతాప్ డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *