పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని మన్నేపల్లి సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (సమర) కోరారు. దారం వారి పాలెం లో గురువారం పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. నర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి, సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి లు ముఖ్య అతిధులు పాల్గొని ప్రారంభించారు. పశు వైద్యాధికారి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పశునంవర్ధక శాఖ ద్వారా అమలు అవుతున్న పెయ్య దూడల పథకం, భీమా, నబ్సీడీపై గడ్డి జొన్నలు, పశువుల దాణాలను ఉపయోగించుకోవాలని కోరారు. నట్టల నివారణ మందులను మింగించారు. పశువుల వ్యాధులను పరిశీలించి మందులను అందించారు. ఎ హెచ్ఎ బ్రహ్మయ్య, గోపాల మిత్రలు పాల్గొన్నారు.
