వైసీపీ తాళ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడుగా నుసుం నాగార్జున ను గురువారం ఏకగ్రీవంగా ఎంపిక చేసారు. ఆపార్టీ కార్యాలయంలో గురువారం మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి అధ్యక్షత సమావేశం నిర్వహించారు. పార్టీ అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్ జీ వెంకటేశ్వర రెడ్డి, కోట క్రిష్ణా రెడ్డి, కోట మన్నే రెడ్డి, మేడగం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచి మేకల చార్లేన్ సర్జన్, ఎంపీటీసీ ప్రభు దాస్
, యూత్ అధ్యక్షుడు విష్ణు పాల్గొన్నారు.

