పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరుశాతంఉత్తీర్ణత సాధించాలి- ఎంపీడీవో అజిత

పదవతరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు కష్టపడి చదివి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ఎంపీడీవో పి.అజిత అన్నారు. మండలంలోని లక్కవరం హైస్కూల్ ను శుక్రవారం సందర్శించారు. పదవతరగతి నూరు రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఏర్పాటు చేసిన స్టడీ అవర్స్ ను
పరిశీలించారు. 10 వతరగతి విద్యార్థులకు పరీక్షల పట్ల బయంలేకుండా వుండాలన్నారు. అన్ని సబ్జెక్ట్ లను బాగా చదివి పూర్తి చేయాలన్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్లో ముందుకు తీసుక వెళ్లేందుకు ఉపాధ్యాయుల భోద నను ఉపయోగించుకుని బాగా శిక్షణ పొందాలని కోరారు . ఉపాద్యాయులు కూడా వెనుకంజలో వున్న విద్యార్థుల పట్ల ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మెరుగయ్యేం దుకు కృషి చేయాలన్నారు. మండంలోని అన్నిపాఠశాలల్లో 10వతరగతి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలాఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంఈవోలు జి.సుబ్బయ్య. ఎల్.సుధాకర్ రావు, హెచ్ఎం అనంత పద్మనాభరావు, ఉపాధ్యాయులు శేషు, తది తరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *