విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయ వృత్తికే ఉంది….కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన.

కంటోన్మెంట్ జనవరి 24
(జే ఎస్ డి ఎం న్యూస్) :
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయ వృత్తికే ఉందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. విద్యార్ధుల ఉన్నతికి కృషి చేసిన బాపూజీనగర్ ప్రాధమిక పాఠశాల హెచ్ఎం ఆశీర్వాదం పదవి విరమణ సందర్భంగా జంపన ప్రతాప్ శనివారం ఆయన్ను శాలువాతో సత్కరించారు. పదవి విరమణ చేయడం బాధాకరం అయినప్పటికీ విద్యార్థులు వారి తల్లితండ్రుల మనస్సుల్లో హెచ్ ఎం ఆశీర్వాదం చిరస్తాయిగ నిలిచిపోతారని అన్నారు. పదవి విరమణ అనంతరం కుటుంభసభ్యులతో ప్రశాంత జీవితం గడపాలని జంపన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అజిత్. శ్రీకాంత్. షకీబ్ హుస్సేన్. పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *