ఈ – పంట నమోదు నూరుశాతం జరగాలి – జిల్లా వ్యవసాయాధికారి (జెడీఏ ) ఎస్ శ్రీనివాస రావు

రబీ 2025-26 పంట నమోదు ఈ – క్రాప్లో నూరుశాతం నమోదు కావాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు చెప్పారు. మండలంలోని విఠలాపురం, తాళ్లూరులలో శనివారం ఈ- పంట నమోదును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. యాప్ ను ఆధునీకరించటం జరిగిందని, తమ పంట నమోదు వివరాలు, ఎవైనా ఫిర్యాదులు ఉంటే ఈ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. రైతులు ఫార్మర్యాప్ న ఉపయోగించుకుని సాంకేతిక సమాచారం, పథకాల వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు, విఏఏలు సాయిరాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *