హైదరాబాద్ జనవరి 25 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం పట్ల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం కర్మన్ ఘాట్ లోని మధుసూదన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయన భౌతిక దేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వంగా మధుసూదన్ రెడ్డి ప్రజాసేవకు అంకితమై నిరంతరం పనిచేశారని, ఆయన అందించిన సేవలు ప్రశంసనీయం అన్నారు. ఆయన అకాల మరణం ప్రజలకు, పార్టీకి తీరని లోటు అని ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతి మరియు సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని ఆమె అన్నారు.
