సికింద్రాబాద్ జనవరి 25
(జే ఎస్ డి ఎం న్యూస్)
ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ జింఖానా మైదానంలో క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులకు ఈ ఎస్ ఐ డీన్ డాక్టర్ శిరీష్ చౌహాన్ క్రికెట్ కిట్టు తో పాటు టీ షర్టులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత
ఇలాంటి క్రీడలలో పాల్గొని తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలన్నారు.ఎవరికి ఏ ఆటపై ఇష్టం ఉంటుందో అందులోనే ప్రతిభను ప్రదర్శిస్తే వారు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని చౌహాన్ అన్నారు .ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు) జిల్లా ఐటీ సెల్ సెక్రెటరీ ఆర్ అశ్విన్, వై సురేష్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
