జిల్లా స్థాయిలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలలో మండల, నియోజక వర్గ స్థాయిలో గెలుపొంది, జిల్లా స్థాయిలో మండలంలోని విద్యార్థులు తృతీయ స్థానంలో సాధించారు. నాగంబొట్ల పాలెంకు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు షేక్ మహామ్మద్ ఫరూక్,షేక్ హర్షియా నబానం, తాళ్లూరు కస్తూరిభా విద్యార్థులు రీనా నుఖీ, కె ప్రిన్సిన్, ఎం రమ్య ప్రతిభ చాటారు. విద్యార్థులకు ఆదివారం ఒంగోలు జరిగిన కార్యక్రమంలో బహుమతులు అందించారు. ప్రశంశా పత్రాలు, బహుమతులు అందుకున్న విద్యార్థులను మండల విద్యాశాఖాధికారులు జి నుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర రావులు అభినందించారు.
