కంటోన్మెంట్ జనవరి 26 , (జే ఎస్ డి ఎం న్యూస్) ;
రిలే దీక్ష పేరుతో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని జిహెచ్ఎంసి లో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నారనీ,ఎంపీ ఈటెలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదనీ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్,బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ లు ఘాటుగా హెచ్చరించారు. రాజకీయ ఎదుగుదల కోసం పార్టీ జెండాలు మార్చే ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఎంపీ ఈటెలను విమర్శించి మాట్లాడే హక్కు ఎక్కడిదని వారుప్రశ్నించారు.ఎన్నికల సమయంలో బి ఆర్ఎస్, బిజెపి పార్టీల పంచన ఉండి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ పంచన చేరిన ఎమ్మెల్యేకు బిజెపిని విమర్శించే హక్కు ఎక్కడదని వారు ప్రశ్నించారు. రిలే దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేకు కంటోన్మెంట్ విలీనంపై. ఇటీవల ఆర్మీ ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలుసమావేశమయ్యారని అన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా విలీనంతో పాటు కంటోన్మెంట్ అభివృద్ధిపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. ఆ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆహ్వానించకపోవడం సిగ్గుచేటని అన్నారు.దీక్షల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకుని నియోజకవర్గ ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని హితువు పలికారు. ఇటీవల అధికారులు నిర్వహించిన సమావేశానికి ఆహ్వానం అందకపోవడం గమనిస్తే ఎమ్మెల్యే కు ఎలాంటి ప్రాధాన్యత ఉందన్న విషయం కూడా స్పష్టమవుతుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయనకు మద్దతు లేదని.కేవలం తన వ్యక్తి గత స్వార్థం కోసం మాత్రమే ఆయన దీక్ష చేస్తున్నారని ప్రజలకు అర్థమైందన్నారు. ఇలాంటి దీక్షలను కంటోన్మెంట్ ప్రజలు నమ్మరని,భానుక ఎద్దేవా చేశారు.
నియోజకవర్గంలో నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు వస్తుందని, అది కూడా లో పేజర్ తో వస్తుందని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి ఎన్నో సమస్యలు నియోజక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్నారని ముందు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు సూచించారు.కొంగ జపం లా దొంగ దీక్షలతో ఆయన తన పబ్బం గడుపుకునే ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని భానుక హెచ్చరించారు.
బోయిన్ పల్లి సీతారాంపూర్ లో కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద గణతంత్ర దినోత్సవాన్నిపురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పంచి గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు.

