బోయినపల్లి జనవరి 26 (జే ఎస్ డి ఎం న్యూస్)
బోయినపల్లి ఎక్స్ రోడ్ లో డా బి ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి , జక్కులు మహేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. మల్లారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

