రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడదాంమంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి-ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడు క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి డా.స్వామి

రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరం పాటుపడదామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడు క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభ దినోత్సవాన ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మనల్ని మనం పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం నేడు అమల్లోకి వచ్చిన రోజు. అని డా. బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ మనకు ఇచ్చిన రాజ్యాంగం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పునాదులు వేసింది. ప్రతిఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి.ఎందరో మహానుభావులు ప్రాణాలు పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారు. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్లింది. నేడు కూటమి పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ పాలనతో పాటు రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
-పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం- విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది
-ఉద్యోగ సాధనే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదవాలి- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం కొండపిలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి డిఎస్ బీవీ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకించిన అనంతరం మంత్రి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం. అంబేద్కర్ గురుకులాల్లో ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుంచి 10కి పెంచాం. ఐఐటి నీట్ లో తృటిలో అవకాశం కోల్పోయిన విద్యార్థులకు ఉచితంగా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నాం. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఉద్యోగ సాధనే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *