బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో“మై భారత్ – మై ఓట్” ఓటర్ అవగాహన కార్యక్రమం.

* హైదరాబాద్,  (జే ఎస్ డి ఎం న్యూస్ ):

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (ఆటానమస్) లో జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) ఆధ్వర్యంలో “మై భారత్ – మై ఓట్” ఓటర్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అప్పియా చినమ్మ  మార్గదర్శకత్వంలో, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి  సహకారంతో జరిగింది. బేగంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్  షేక్ షఫీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కలిగించారు. యువత ప్రజాస్వామ్యాన్ని బలపర్చే విధంగా బాధ్యతగా ఓటు వేయాలని ప్రోత్సహించారు.
కార్యక్రమంలో భాగంగా బేగంపేట రైల్వే స్టేషన్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని ప్రజల్లో ఓటింగ్ ప్రాముఖ్యతపై సందేశాన్ని వ్యాప్తి చేశారు.
అలాగే, తొలిసారి ఓటు వేయబోతున్న ఐదుగురు మొదటిసారి ఓటర్లు ను సన్మానించడం ద్వారా యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములుగా మార్చే ప్రయత్నం చేశారు.
ఈ కార్యక్రమంలో “మై భారత్ – మై ఓట్” బెస్ట్ వాలంటీర్ అవార్డు గ్రహీత మనోజ్ ఖన్నా పాల్గొని, విద్యార్థినులకు స్పూర్తిదాయకమైన సందేశం అందించారు.ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. డి. సరిత సమర్థవంతంగా నిర్వహించగా, ఇతర ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. డి. సరిత, డా. ప్రసన్న, డా. నర్సింహులు,  డా. మధుకర్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం “నేను కాదు – నీవు” అనే ఎన్‌ఎస్‌ఎస్ నినాదంతో విద్యార్థినుల్లో ఓటింగ్ పై బాధ్యతాయుతమైన అవగాహనను పెంచుతూ ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *