కంటోన్మెంట్, జే ఎస్ డి ఎం న్యూస్ :
అహింసా ఆయుధం తో స్వాత్యంత్రం సాధించిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపూజీనగర్ లోని గాంధీ విగ్రహానికి జంపన ప్రతాప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు..ఈ సందర్భంగా జంపన మాట్లాడుతూ.. సత్యం అహింస ను నమ్మి సత్యాగ్రహాలు చేసి ఆంగ్లే్యులను గడగడ లాడించి మన దేశానికి స్వాత్యంత్రం సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరయ్య. బండి శ్రీనివాస్, అజిత్ కళ్యాణ్, శ్రీ కాంత్,బిల్డర్ నర్సింహ, సాయిబాబా యాదవ్, బాను, గోమతి, కరణ్ సింగ్, వాసు గౌడ్, రామరావు, సురేష్, ముకేశ్ యాదవ్, వరప్రసాద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు..

