బేగంపేట జనవరి 31 (జేఎస్డిఎం న్యూస్) :
క్రీడాకారులకు మాజీ ఎన్డిఎంఏ వైస్ చైర్మన్. మర్రి శశిధర్ రెడ్డి శనివారం క్రికెట్ కిట్లను అందజేశారు.ప్రధానమంత్రి సంసద్ ఖేల్ కార్యక్రమంలో భాగంగా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జింఖానా మైదానంలో క్రీడా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎన్డిఎంఏ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి హాజరై క్రీడాకారులకు క్రికెట్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల వైపు మరింత ఆసక్తి చూపాలని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను ప్రదానం చేసి అభినందించారు. క్రికెట్ మ్యాచ్‌లలో యువ క్రీడాకారులు చూపిన ప్రతిభ, ఉత్సాహం ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు, యువతను క్రీడల వైపు ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెమలి ఆనంద్, సత్యనారాయణ గౌడ్, అశ్విని, మహేష్ దాశరథ్, సురేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

