వెంకటేశ్వర ఆలయం లో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం…ప్రత్యేక పూజలో బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన…బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మద మల్లి కార్జున్..

కంటోన్మెంట్, జే ఎస్ డి ఎం న్యూస్ :
ప్రసిద్ధి గాంచిన బోయిన్ పల్లి న్యూ సిటీ కాలనీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు ఆలయ మూలావిరాట్ కు రంగురంగు పూల గజమాల తో చేసిన ప్రత్యేక అలంకరణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు ప్రత్యేక అలంకరణ తో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమం లో శనివారం ఉదయం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా అధిష్టింపచేశారు. .సాయంత్రము భేరీపూజ శ్రీవారి శేష వాహనం సేవ ఆలయ ప్రాంగణం లో కన్నులపండుగల జరిగింది. వేడుకలకు హాజరైన జంపన ప్రతాప్ వేడుకలను ప్రారంభించగా , కంటోన్మెంట్ బోర్డు సివిలియం నామినేటెడ్ సభ్యురాలు భానునర్మద అర్చకులకు వస్త్రాలను అందజేశారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *