పశుపోషకులకు కూటమి ప్రభుత్వం చేయూత నిస్తుందని జడ్పీటీసీ మారం వెంక టరెడ్డి, వైస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి అన్నారు. తాళ్లూరులో పశుసంవర్ధకశాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పశు వైద్యశిబిరంను జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డిలు ప్రారంబించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పశు సంపద దెబ్బతిన కుండా వుండేందుకు ప్రభుత్వం చేయూత నిస్తున్నదని తెలిపారు. ఈ సీజన్లో సంక్రమించే వ్యాధుల వల్ల పశువులు నష్ట పోకుండా వుండేందుకు ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. పశువులకు వ్యాధులు సంక్రమిస్తున్నం దున ప్రభుత్వం వైద్యశిబిరాలు నిర్వహించి పరీక్షలు జరిపి తగు నివారణమందులు అందచేయటం జరుగుతుందన్నారు. పశువులు, జీవాలకు నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టిందని రైతాంగం, పశుపోషకులు శిభిరాలను సద్వినియోగం చేసు కోవాలన్నారు. మండల పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ
పశుసంవర్తక శాఖ ద్వారా అమలు అవుతున్న పెయ్యదూడల పథకం, భీమా, సబ్సీడీపై గడ్డి జొన్నలు, పశువుల దాణాను ఉపయోగించుకోవాలన్నారు. నట్టల నివారణ మందులను త్రాగించారు. పశువులకు చికిత్సలు జరిపి వ్యాధులన్న పశువులను మందులు అందజేశారు. ఈకార్యక్రమంలో టీడీపీనాయకులు ఐ.శ్రీనివాసరెడ్డి, సత్యవర్ధన్, సుబ్బారావు, ప్రభాకర్ రెడ్డి , గోపాలమిత్రలు నుసుం ఆదినారాయణరెడ్డి, మూల రోశిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
