కంటోన్మెంట్ ఫిబ్రవరి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ ను గ్రేటర్ లో విలీనం చేయాలని కోరుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే దీక్ష చేశారు.ఎనిమిది రోజుల పాటు చేసిన ఎమ్మెల్యే దీక్షకు పలు పార్టీలు,,పలు సంస్థల నుంచి మద్దతు లభించింది .ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగడంతో ఎమ్మెల్యే దీక్షను విరమించారు.కంటోన్మెంట్ ను జి హెచ్ ఎం సి లో విలీనం చేయాలంటూ మొదటి అడుగుగా తాను చేపట్టిన దీక్షకు ప్రజల తో పాటు వివిధ రాజకీయ పార్టీలు,వివిధ సంఘాల నుంచి వచ్చిన స్పందన ఎంతో బాగుందని,తప్పని పరిస్థితుల్లో దీక్షను విరమిస్తున్నామని ఆయన ప్రకటించారు. మరో అడుగు గా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్ని వార్డులలో పర్యటించి ప్రజలకు సమస్యపై మరింత అవగాహన కల్పించి సంతకాల సేకరణ చేస్తానంటూ ఎమ్మెల్యే దీక్ష దీక్షాస్థలి వద్ద ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని మరో రాజకీయ పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుని అడుగులు వేయడం,మొదటిగా ఆ పార్టీ అగ్రనేత సంతకాన్ని సైతం సేకరించడం తో శ్రీ గణేష్ ఆ ఆలోచన ను విరమించుకుని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్ట నున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.అయితే కొత్తగా ఎమ్మెల్యే ప్రతి వార్డులో పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.దీని ద్వారా అన్ని వార్డులలో పోస్ట్ కార్డులు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద ఎత్తున పోస్ట్ కార్డుల ద్వారా తమ కోరికను కేంద్రానికి తెలియ జేసేందుకు సిద్ధమవుతున్నారు.ఎమ్మెల్యే మరో ఆలోచన అన్ని పార్టీలు ,కాలనీల అసోసియేషన్ లు,బస్తీ సంఘాలను కలుపుకుని జే ఏ సి గా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.దీంతో పాటు డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియ జేసేందుకు సిద్ధమవుతున్నారు.మొత్తం మీద కంటోన్మెంట్ ను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం కోసం చేస్తున్న ప్రయత్నం ఫలించేందుకు శ్రీ గణేష్ చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు,వివిధ వర్గాల మద్దతు లభిస్తే ఆయన లక్ష్యం సాధిస్తామన్న ధీమా ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్నారు.
