బేగంపేట ఫిబ్రవరి 1 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు క్షమించరానివి, రాజకీయాలు దిగజారిపోయాయి అనడానికి ఆయన మాటలు నిదర్శన మని సికింద్రాబాద్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ అన్నారు.
ఆయన చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అచ్చోసిన ఆంబోతుల్లా అసత్యాలు ప్రచారం చేస్తూ నాటకాలాడుతున్నారని శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.హద్దు అదుపులేకుండా నీచమైన బాష, బూతులతో నాయకులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సభ్య సమాజం సహించదన్నారు.
రాష్ట్రంలో మళ్ళీ బూతుల సంస్కృతిని తెరపైకి తెస్తున్న వైసీపీ నేతలు రాజకీయాలను కలుషితం చేస్తూ గొడవలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారనిధ్వజమెత్తారు.గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబాన్ని అంబటి రాంబాబు అవమానించాడన్నారు.
నేడు అంబటి ఒక ఆంబోతులా చంద్రబాబుపైదుర్భాషలాడుయున్నాడని అంబటినీ రాజకీయాల నుంచి బహిష్కరించాలన్నారు.
