బేగంపేట ఫిబ్రవరి 1 , (జేఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం కుంకుమార్చన లో భాగంగా పూర్ణాహుతి హోమం చండీ హోమం సువాసిని పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి జి. మనోహర్ రెడ్డి, ఫౌండర్ ఫ్యామిలి మెంబర్. ఎస్. రామేశ్వర్ , మాజీ ధర్మకర్తలు మరియు మహిళా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని లలితా పారాయణము, కుంకుమార్చన పూజ, మహిళా సత్సాంగ్ బృందము చేసారు. పూజ అనంతరం భక్తులందరికి తీర్థ ,ప్రసాద వితరణ చేశారు. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి హోమం, పూజలలో పాల్గొన్నారు.


