బోయిన్ పల్లి ఫిబ్రవరి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేస్తానని బోయిన్ పల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నరేందర్ అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ ఆరవ వార్డు పరిధిలోనీ గెస్ట్ హౌస్ లో మున్నూరు కాపు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నరేందర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బోయిన్ పల్లి, హస్మత్ పెట్ ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మున్నూరు కాపు లు తరలివచ్చారు. ఈ సందర్భంగా వివిధ వృత్తులలో సేవలు అందిస్తున్న డాక్టర్లు, న్యాయవాదులు,ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని సభ్యులు కూడా తమ సహకారాన్ని అందించాలని కోరారు. మున్నూరు కాపులకు ఎలాంటి ఆపద వచ్చినా ,వారికి సంఘం అండగా నిలబడుతుందని అన్నారు. త్వరలో బోయిన్పల్లి ప్రాంతంలో నివసిస్తున్న మున్నూరు కాపుల గడపగడపకు వెళ్లి సంఘంను మరింత బలోపేతం చేస్తామని వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తామని సంఘం భవన నిర్మాణానికి కృషి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సెక్రటరీ వేణుగోపాల్, కోశాధికారి తేళ్ల శ్రీకర్, వైస్ ప్రెసిడెంట్లు తేళ్ల సురేందర్, నాగరాజు, జాయింట్ సెక్రటరీ చిత్తానంద, సభ్యులు నరేందర్ రాజ్ పటేల్ టి సునీల్ టి శ్రీనివాస్ సురేందర్ రవికుమార్ పెద్ద సంఖ్యలో మున్నూరు కాపు సంఘ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
