సీ ఎం రేవంత్ కు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఎమ్మెల్యే శ్రీగణేష్..

కంటోన్మెంట్ ఫిబ్రవరి 2
(జే ఎస్ డి ఎం న్యూస్) :
విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ రైజింగ్ -2047
లో భాగంగా ప్రపంచంలోనే పేరెన్నికగన్న కంపెనీలు హాజరయ్యే దావోస్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొని తెలంగాణ పురోగమిస్తున్న తీరును, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అక్కడ పాల్గొన్నకంపెనీలప్రతినిధులకు వివరించడం, అమెరికా వెళ్లి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీ లో 20 దేశాల నుండి 60 మంది ప్రముఖులు పాల్గొన్న 21 వ శతాబ్దంలో నాయకత్వం పై నిర్వహించిన ఎక్సిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో నిర్వహించిన తరగతులకు హాజరై శిక్షణ పూర్తి చేసుకుని ,పట్టా అందుకున్న మొదటి ముఖ్యమంత్రి గా చరిత్రలో నిలిచిన నిత్య విద్యార్థి రేవంత్ రెడ్డి ఈరోజు తెల్లవారు జామున రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *