ఓల్డ్ బోయిన్ పల్లి ఫిబ్రవరి 2(జే ఎస్ డి ఎం న్యూస్)
ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సోమవారం విద్యుత్ అధికారులతో కలసి పాదయాత్ర చేశారు.ఫ్రెండ్స్ కాలనీలో బంచ్ కేబుల్ వేయించారు.స్థానికులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకు వచ్చారని.దీంతో విద్యుత్ శాఖాధికారులకు సమస్యను వివరించి బంచ్ కేబుల్ వేయించానని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముద్దం వెంట
విద్యుత్ శాఖ అధికారులు
ఫ్రెండ్స్ కాలనీవాసులు రాములు, చందర్ గౌడ్ యాదగిరి, ఇతర బస్తీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కార్పొరేటర్ కి ధన్యవాదాలు తెలియజేశారు.


