లెప్రసీ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ప్రధానోపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బా
రెడ్డి కోరారు. వెలుగు వారి పాలెం ఎంపీ ప్రాధమిక పాఠశాల (ఎఎ)లో సోమవారం విద్యార్థులకు లెప్రసీ వ్యాధిపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. లెప్రసీ (కుష్టు) వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల విధానం, వైద్య విధానంపై ఆరోగ్య కార్యకర్తలు వివరించారు. వ్యక్తి గత శుభ్రత పాటించాలని కోరారు. ప్రతిజ్ఞ చేయించారు.
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రభావతి, సుజాత, అంగన్ వాడీ టీచర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
