కూకట్ పల్లి ఫిబ్రవరి 3 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ , ఈపీసీసీ ఉపాధ్యక్షుడు *బండి రమేష్* పార్టీ నాయకులతో కలిసి మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగావర్ ని ఆయన కార్యాలయంలో కలిశారు. మల్కాజ్గిరి జోన్ పరిధిలోకి వచ్చే ప్రకాష్ నగర్, ఫతేనగర్, బోయిన్పల్లి, హస్మత్ పేట ,డివిజన్లోని పలు సమస్యలపై గంగావర్ తో రమేష్ చర్చించారు. ఇంచార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు సహాయ సహకారాలతో విడుదలైన నాలుగు కోట్ల నిధులను అభివృద్ధి ప్రాతిపదికన కేటాయించాలని కోరారు. బోయినపల్లి చెరువులో గుర్రపుడెక్క తొలగించి సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రకాష్ నగర్ పరిధిలోని ఎస్సీ బీసీ కాలనీలో వరద ముంపు నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రమేష్ సూచించారు .సంచిత్ఈ మేరకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలోబేగంపేట్ డివిజన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరపల్లి రమేష్ ,
ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు కుక్కల రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.

