సస్య రక్షణ చర్యలపై ప్రత్యేక శ్రర్థ తీసుకోవాలి

రైతులు నన్యరక్షణ చర్యలపై ప్రత్యేక శ్రర్థ తీసుకోవాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి కోరారు. మండలంలోని తాళ్లూరు, శివరామపురం, బొద్దికూరపాడు గ్రామాలలో మంగళవారం వ్వవసాయాధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్ర వెత్త డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అవసరమైన మేరకు మాత్రమే రసాయనిక ఎరువుల వాడాలని అధిక మొత్తంలో వాడినట్లయితే నెల నినత్తువ అవుతందని చెప్పారు. నేల ఆరోగ్యం, భూసార పరీక్షా విధానం, నమస్యాత్మక భూములను బాగు చేయుట గురించి వివరించారు. ఒంగోలు జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి శేషమ్మ మాట్లాడుతూ భూసార పరీక్షా ఫలితాల కార్డులపై అవగాహన కల్పించారు. భూసార ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం, సేంద్రీయ, జీవన ఎరువుల ప్రాముఖ్యత, పంట అవశేషాలను కాల్చటం వలన కలిగే నష్టాలు గురించి వివరించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ ఎపీ ఎఫ్ ఆర్ మొబైల్ యాప్ గురించి వివరించారు. జీవన ఎరువుల గురించి రైతులకు కరదీపికలు అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, కెవీకే ఎన్ ఎంఎన్ మానన, విఏఏలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *