వ్యాధులపై విద్యార్థులు అవగాహన కలిగి చిన నాటి నుండే పరిశుభ్రతకు ప్రాధాన్యత
ఇవ్వాలని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ పేర్కోన్నారు. మండలంలోని నాగంబొట్ల పాలెం, తూర్పుగంగవరం గ్రామాలలో బుధవారం విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేసారు. కంటి చూపు లోపం ఎప్పటికప్పుడు గుర్తించి తల్లిదండ్రులకు తెలిపి తక్షణమే కంటి వైద్య నిపుణులను సంప్రదించాలని కోరారు. క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. వెలుగు వారి పాలెంలో ప్రాధమిక పాఠశాలలో కూడ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో సొసైటీ అధ్యక్షుడు నుబ్బయ్య, హెచ్ఎం లు కన్నయ్య, రమేష్, పి నుబ్బా రెడ్డి, హెచ్ఐఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ ఎన్ రమణమ్మ, హెచ్‌పీ సుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

