కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు అందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరులో మహిళలకు బుధవారం ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పించారు. మండలంలో ఇంకా పలు గ్రామాలలో 1596 మంది రైతులు వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ పరిధిలోని రాలేదని చెప్పారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, వడ్డీలేని పంట రుణాలు, యాంత్రీకరణ పథకం వంటి అనేక పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని చెప్పారు.
