బేగంపేట ఫిబ్రవరి 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట్ శ్యామ్ లాల్ బిల్డింగ్ ఆర్ బి ఐ క్వార్టర్స్ ముందు ఫుట్ పాత్ పై ఉన్న డబ్బాలను అధికారులు గురువారం తొలగించారు.
ఈ విషయం స్థానిక బిజెపి నాయకులు గంగాధర్ గౌడ్ ద్వారా తెలుసుకున్న మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గురువారం సాయంత్రం డబ్బాలు తొలగించిన స్థలాన్ని పరిశీలించారు.
శ్యాంలాల్ బిల్డింగ్ ఆర్బీఐ నివాసాల ముందు ఫుట్ పాత్ పై ఏర్పాటు చేసిన డబ్బాలను అధికారులు గురువారం తొలగించారు.
ఈ ప్రాంతాన్ని ఎంపీ ఈటెల కూకట్ పల్లి నియోజకవర్గం బిజెపి ఇన్చార్జ్ మాధవరం కాంతారావు, అసెంబ్లీ కన్వినర్ శ్రీకరరావు, యామగోని గంగాధర్ గౌడ్ ల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులను అడిగి సమస్య తెలుసు కున్నారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ. ఈ సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానంటూ వారికి వివరించారు. ఈ కార్య క్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


