బేగంపేట ఫిబ్రవరి 5 (జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ప్రమాదాల నివారణకు సహకరించాలని తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జి.శంకర్ రాజు అన్నారు. గురువారం బేగంపేట పరిధిలోని ఎయిర్టెల్ ఉద్యోగులకు ట్రాఫిక్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. తమ స్వంత భద్రత తో పాటు ఇతర రహదారి వినియోగదారుల భద్రతను కాపాడుకోవాలంటే ట్రాఫిక్ నిబంధనలు కట్టుదిట్టంగా పాటించాలన్నారు. ముఖ్యంగా అతివేగం వల్ల కలిగే ప్రమాదాలు, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్, డ్రైవింగ్, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకం వల్ల కలిగే ప్రమాదాలు,ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం, లైన్ డిసిప్లేన్ పాటించకపోవడం వల్లనే ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. క్రమశిక్షణతో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఏసీపీ తెలియజేసారు. ఈ కార్యక్రమానికి హీరో మోటార్స్ తరుపున సాదిక్, ప్రవీణ్, ఎయిర్టెల్ సీఈఓ అజయ్ అనంత్ పధ్మనాభన్, నోడల్ హెడ్ గీత, నోడల్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని జూమ్ వేదిక ద్వారా లైవ్ ప్రసారం చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 2వేల మంది వీక్షించారు.

