కంటోన్మెంట్ ఫిబ్రవరి 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాల్సిన స్థలాన్ని గురువారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులతో కలిసి పరిశీలించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన మంచినీటి స్టోరేజ్ గ్రౌండ్ లెవెల్, ఎలివేటెడ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని రెండు రోజుల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వాటర్ వర్క్స్ ఎం. డి అశోక్ రెడ్డి ని కలిసి మాట్లాడారు . ఈ మేరకు ఎమ్మెల్యే వాటర్ వర్క్స్ డైరెక్టర్ శ్రీధర్, చీఫ్ జనరల్ మేనేజర్ మహేష్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అభిలాష్ ల తో పాటు కంటోన్మెంట్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు రాజ్ కుమార్, శశాంక్ ల కు సమాచారం ఇచ్చి స్థల పరిశీలనకు రావడంతో వారితో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ తిరుమలగిరి లోని వాటర్ పంప్ హౌస్ లో ఉన్న స్థలాన్ని పరిశీలించారు.
త్వరగా స్థలాన్ని ఎంపిక చేసి రిజర్వాయర్ల నిర్మాణాన్ని మొదలు పెట్టాలని ఎమ్మెల్యే అధికారులకు చెప్పారు. ప్రభుత్వం నుంచి, తన నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని, అవసరమైతే ముఖ్యమంత్రి ని కలిసి ఎన్ని నిధులైనా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నానని, అధికారులు కూడ సహకరించి రిజర్వాయర్ల నిర్మాణాలను త్వరగా మొదలు పెట్టాలని ఎమ్మెల్యే చెప్పారు.స్థల పరిశీలనలో ఎమ్మెల్యే తో కాంగ్రెస్ నాయకురాలు నాగినేని సరిత తదితరులు ఉన్నారు.
