బేగంపేట ఫిబ్రవరి 6
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆర్ధిక ఇబ్బందుల కారణంతో మెరుగైన వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 25.96 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను 68 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వైద్యం చాలా ఖరీదుగా మారడంతో అనేకమంది ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సకాలంలో వైద్యం చేయించే విషయంలో నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పరమైన ఇబ్బందులనుఎదుర్కొంటున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు నాగులు, కిషోర్, ప్రేమ్ కుమార్, శ్రీహరి, శేఖర్, ఆంజనేయులు, కూతురు నర్సింహ, కుమార్ యాదవ్, జమీర్, వెంకట్ బాబు, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

