సీవరేజ్ సమస్యలను చాలా వరకు పరిష్కరించాం ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట ఫిబ్రవరి 6
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో సీవరేజ్ సమస్యలను చాలా వరకుపరిష్కరించినట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మోండా మార్కెట్ మెయిన్ రోడ్ పై 3.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 కు ముందు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని చెప్పారు. తాను వచ్చిన తర్వాత అవసరమైన ప్రాంతాలలో నూతన సీవరేజ్ లైన్ ల ఏర్పాటు తో పాటు, పైప్ లైన్ సామర్థ్యం పెంచాలాల్సిన ప్రాంతాలలో పునరుద్ధరణ పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్కడ రోడ్లపై డ్రైనేజీ లీకేజీలు ఉండొద్దనే లక్ష్యంతో పని చేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దీపికా, బోయిన్ పల్లి సర్కిల్ డిసి డాకు నాయక్, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశిష్, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు నాగులు, రాములు, ఓదెల సత్యనారాయణ, ప్రమోద్, మహేందర్, మధు తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *