ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో అందిన అర్జీలకు నిర్ణీత గడువులోపు నాణ్యతతో పరిష్కారాన్ని చూపాలి – జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో అందిన అర్జీలకు నిర్ణీత గడువులోపు నాణ్యతతో పరిష్కారాన్ని చూపాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, కళావతి, విజయజ్యోతి, మాధురి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లీనిక్ ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు. ప్రజా సమస్య పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను బియాండ్ యస్.యల్ .ఏ పోకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ రోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో మొత్తం 513 వినతులు రాగా అందులో రెవెన్యూ సంబంధిత అంశాలపై 358 వినతులు రావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *