కంటోన్మెంట్ ఫిబ్రవరి 21
(జే ఎస్ డి ఎం న్యూస్) :👍
దుకాణదారులను ప్రభుత్వం ఆదుకోవాలనీ కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం లో భాగంగా రోడ్డు విస్తరణ లో సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్. కడక్ పుర. చిన్నతోకట్ట ప్రధాన రోడ్డు లో గత ముప్పై నలభై ఏళ్లుగా దుకాణాల్లో అద్దెకు ఉంటూ జీవనం గడిపే పేదలు తమ దకాణాలు కోల్పోతు న్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకవేళ్తానని జంపన ప్రతాప్ అన్నారు. అద్దె షాప్ లు కోల్పోతున్న సుమారు 60 మంది షాప్ నిర్వాహకులు జంపన ప్రతాప్ ను కలిసి సమస్య వివరించి వినతి పత్రం అంద జేశారు. గతంలో పాతబస్తీ లో అద్దె షాప్ లు కొల్పయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసినట్లు పలువురు షాప్ నిర్వాహకులు జంపన ప్రతాప్ కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెకానికులు. చెప్పులు కుట్టే వాళ్ళు. కార్పెంటర్స్. పెయింటింగ్ చేసే వాళ్ళు.సోఫా మేకర్స్. టివి సర్వీసింగ్. వెల్డింగ్. పలు చిరు వ్యాపారులు అద్దె షాపుల్లో పనులు చేసు కుంటూ జీవిస్తున్నారని వారికి నష్టం కలగకుండా ఆర్థిక సహాయం అందేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామిచ్చారు. ఈ కార్యక్రమంలో సయెద్ సుమర్. ఆఫ్జల్ ఖాన్. దివాకర్. ఇమ్రాన్. జూబైర్ ఇతర షాప్ నిర్వాహకులు పాల్గొన్నారు.
