జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్ప్రగతి మహావిద్యాలయంలో భారీ సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు.

హైదరాబాద్ ఫిబ్రవరి 21
(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా చేపట్టిన జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా, ఖైరతాబాద్ జోన్ పోలీసులు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ విభాగం సంయుక్తంగా నేడు అబిడ్స్‌లోని ప్రగతి మహావిద్యాలయం (డిగ్రీ & పీజీ కళాశాల)లో భారీ అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, క్రైమ్స్ & ఎస్.ఐ.టి, ఎం.శ్రీనివాసులు, హైదరాబాద్ సిటీ డి.సి.పి, సైబర్ క్రైమ్ యూనిట్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సదస్సులో భాగంగా అధికారులు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలపై ప్రజలను మరియు విద్యార్థులను అప్రమత్తం చేశారు. పెట్టుబడి మరియు పార్ట్-టైమ్ ఉద్యోగ మోసాలు: సోషల్ మీడియా ద్వారా వచ్చే నకిలీ ఆఫర్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. చట్టాన్ని అమలు చేసే సంస్థల పేరుతో వచ్చే నకిలీ కాల్స్‌ను నమ్మవద్దని కోరారు.
మ్యూల్ అకౌంట్స్ (Mule Accounts): తెలియని వ్యక్తులకు లేదా డబ్బు ఆశ చూపే వారికి మీ బ్యాంక్ ఖాతాలను ఇవ్వకూడదని, అవి సైబర్ నేరాలకు సాధనాలుగా మారుతాయని హెచ్చరించారు. ఏపీకే (APK) మాల్వేర్ తెలియని లింక్‌ల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని తెలిపారు.
పోలీసుల సూచనలు.
తెలియని ఏపీకే ఫైళ్లు లేదా రిమోట్ యాక్సెస్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు.అన్నారు.
బ్యాంక్ వివరాలు, పిన్ (PIN), ఓటీపీ (OTP) లేదా పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.అనిఉద్యోగ లేదా లోన్ ఆఫర్లను అధికారికంగాధృవీకరించుకున్న తర్వాతే స్పందించండి.
ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
నిరంతర అవగాహన ద్వారా సురక్షితమైన డిజిటల్ సమాజాన్ని నిర్మించడమే హైదరాబాద్ సిటీ పోలీస్ లక్ష్యం అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *