ముండ్లమూరు మండలంలోని మారెళ్ల గ్రామంలో శ్రీ బిహారీ లాల్ ఆరోరా కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి శిలా విగ్రహ మహా ప్రతిష్ట కార్యక్రమం బుధవారం కనుల పండువగా నిర్వహించారు. బిహారీలాల్అరోరా కుటుంబసభ్యులు నాంచారమ్మ. రాజ్కుమార్ భన్సారీ దాస్ ఆరోరా, విమల్ రాజ్ కుమార్ ఆరోరా దంపతులు, మనీష్ రాజ్ కుమార్ అరోరా లు వారి కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొని భక్తి శ్రర్థలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిలా విగ్రహ ప్రతిష్టాపకులు అనుమకొండ మచ్చెరికూరి శివ రామ బ్రహ్మర్షి చే ప్రతిష్టా తృతీయాహ్నికము పూజలు నిర్వహించారు. కార్యక్రమ రుత్వికులు ప్రధానా చార్యులు రాముగడు గురు బ్రహ్మయోగేశ్వరులు, వీర బ్రహ్మా చార్యులు, నోస్సం సుఖేచార్యులు, నాగ బ్రహ్మా చార్యులు, విశ్వ బ్రహ్మా చార్యుల ఆధ్వర్యంలో పలు ప్రత్యేక ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం వేకువజామున సుప్రభాత సేవ విశ్వక్ సేన గణపతి పూజ, పుణ్యాహవాచన, వాస్తు పర్యగ్నికరణ, యంత్రాభిషేకం మంత్ర జపములు నిత్య పూజలు, గర్తపూజ రత్నన్యాస యంత్ర స్థాపన, బింబి ప్రతిష్టలు, కళాన్యాస ప్రాణ ప్రతిష్ట, దృష్టి స్థాపన, కుంభ ధాన్య దేను, రాజ్యాదీప దర్శనములు, కుష్మాండాది బలిచ్చేదన. పూర్ణా హుతి, యంత్రతీర్థ ప్రసాదములు, భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. మహిళా భక్తులచే కోలాటం ప్రదర్శించారు.



