అమ్మ ఆలయం వద్ద అన్న దానం చేయడం అభినందనీయం…బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్.

బోయిన్ పల్లి ,మార్చి 10,(జే ఎస్ డి ఎం న్యూస్)
ప్రముఖ సంఘ సేవకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధి ఎస్ వి పృథ్వీనాధ్ సతీమణి సుమిత్రదేవి 76వ జయంతి సందర్భంగా బోయిన్ పల్లి బాపూజీనగర్ శ్రీ దేవి నల్ల పోచమ్మ ఆలయం వద్ద మంగళవారం కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై పృథ్వీనాధ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించి అన్నదానం లో పాల్గొన్నారు. ఆలయంలో దాతలు తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్ధం అన్నదానం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కుమారులు అనిల్, సునీల్, కుమార్తె అనిత, ఆలయ కమిటి సభ్యులు ప్రేమ్ ముదిరాజ్, అజిత్, పుట్టి నర్సింహ, శ్రీకాంత్, రామరావు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *