కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ఇండియన్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో అందించే అవార్డులకు ఈ ఏడాది గుంటూరుకు చెందిన శాఖమూరు పద్మ ఎంపికయ్యారు. పెయింటింగ్స్ అండ్ క్లే క్రాఫ్ట్స్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన “ఇండియా ఆర్ట్స్–2026” అవార్డుకు ఆమెను ఎంపిక చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఈ మేరకు బుధవారం సంస్థ నిర్వాహకుల నుంచి పద్మకు అవార్డు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
సైన్స్‌లో బి.ఎడ్ పట్టభద్రురాలైన పద్మ కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అనంతరం పెయింటింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌పై ఉన్న ఆసక్తితో వాటి బోధన వైపు మళ్లారు. ప్రస్తుతం 5 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారుల నుంచి అన్ని వయసుల వారికీ వారి ఆసక్తికి అనుగుణంగా ఆర్ట్స్ శిక్షణ అందిస్తున్నారు.
ప్రస్తుతం గుంటూరు జిల్లా లాం ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పద్మ పనిచేస్తున్నారు.