హైదరాబాద్ మార్చి 20 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి హైదరాబాద్ కు చెందిన ధర్మవరపు సుజాత అనే పేషెంట్ కు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్చార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి అందజేశారు. పేషంట్ తరఫున వారి బంధువులు ఈ చెక్కును అందుకున్నారు.
శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారెడ్డి ఈ చెక్కును వారికి అందజేశారు.కష్టకాలంలో ఉన్న పేషంట్ సుజాతను నాలుగు లక్షల ముక్యమంత్రి సహాయ నిధి నుంచి భారీ మొత్తంలో సి ఎం ఆర్ ఎఫ్ ఇప్పించి ఆదుకున్న చిన్నారెడ్డి కి పేషంట్ , వారి బంధువులు ధన్యవాదాలు తెలిపారు.
