తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి యూనియన్ బ్యాంకు తూర్పుగంగవరం
శాఖ ఇన్వర్టర్ను బహుకరించారు. పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఈఓ చంద్రశేఖర్ బాబు పాల్గొని బ్యాంకు మెనేజర్ వెంకట రెడ్డి, ఆర్ డీఓ లక్షానాయక్ ల నుండి ఇన్వర్టర్ ను అందుకున్నారు. పీహెచ్సీకి అవసమైన ఇన్వర్టర్ ను అందించినందుకు ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ రమణమ్మ హెచ్ వీ నుశీల, ఫర్మాసిస్ట్ శిల్వా, సీఐ కోటేశ్వర రావులు పాల్గొన్నారు.
