సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్సైలను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు- ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ

పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన దర్శి ట్రాఫిక్ ఎస్సై షేక్ గౌస్ బాషా( ఎస్సై -285, జిల్లా స్పెషల్ బ్రాంచ్),42 సం’11 నెలలు సర్వీస్, జిల్లా కమ్యూనికేషన్ ఎస్సై డి.చిన్న బాబు( ఎస్సై -399) 36 సర్వీస్ లను మంగళ వారం ఎస్పీ జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి జ్ఞాపికలను బహుకరిస్తూ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ సుదీర్ఘకాలం విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం ఆనందదాయకమని తెలిపారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో బాధ్యతాయుతంగా జిల్లా పోలీసు శాఖకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. వారి యొక్క సర్వీస్ లో రివార్డ్స్, పతకాలు, గుడ్ సర్వీస్ పొందియున్నారు. ఏటువంటి రిమార్కులు లేకుండా సుదీర్ఘ కాలం పోలీసుశాఖకు సేవలందించడం అభినందనీయమన్నారు. పోలీసు ఉద్యోగంలో సేవలందించేందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని, ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితం గడపాలని ఆకాంక్షించారు. విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీసు శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, ఎఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *