ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ. రాజా బాబు
ఆదేశాల మేరకు, స్థానిక ప్రకాశం భవనంలోని జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్ లో డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి మరియు డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సన్నాహక సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహనీయుల జయంతి ఉత్సవాల నిర్వహణ పై వివిధ దళిత సంఘాల నాయకులు, వక్తలు తమ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది.
సమావేశం ముఖ్యాంశాలు:
- సమష్టి కృషి: మహనీయుల ఆశయాలకు అనుగుణంగా, జిల్లా యంత్రాంగం మరియు దళిత సంఘాలు కలిసికట్టుగా ఈ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు.
- అధికారుల భాగస్వామ్యం: ఈ రెండు జయంతి వేడుకల్లో జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని డి. ఆర్. ఓ హామీ ఇచ్చారు.
- సమస్యల పరిష్కారం: దళిత సంఘాల నాయకులు లేవనెత్తిన స్థానిక సమస్యలను, ఉత్సవాల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను కలెక్టర్ గారికి నివేదించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఈ సమన్వయ సమావేశంలో పి. కోటేశ్వరరావు (మాదిగ సంక్షేమ సంఘం), బిళ్ళ చెన్నయ్య (రాష్ట్ర అధ్యక్షులు, మాలమహానాడు), ఆర్. కోటి మాదిగ (ప్రకాశం జిల్లా అధ్యక్షులు, ఎం. ఆర్. పి ఎస్), సి.హెచ్. బెంగళూరు రావు (దళిత సంఘాల ఐక్యవేదిక), రవిచంద్ర ఎస్. సి సెల్ అధ్యక్షులు) వీరితో పాటు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన దళిత సంఘాల ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

