ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంటు గ్రూపు-డీ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఏప్రిల్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి ఎస్.నిర్మలజ్యోతి కోరారు. ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అర్హులైన 100 మంది అభ్యర్థులకు ఈ శిక్షణ 60 రోజుల పాటు జరుగుతుందని ఆమె తెలిపారు. శిక్షణ కాలంలో స్టైఫండ్ తో పాటు స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారని తెలిపారు. దరఖాస్తులను కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల భవనంలోని బీసీ స్టడీ సర్కిల్లో అందజేయాలని కోరారు.
రైల్వే రిక్రూట్మెంటు ఉచిత శిక్షణ – 10లోగా దరఖాస్తు చేసుకోవాలి -జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి ఎస్.నిర్మలజ్యోతి
01
Apr