పిడుగుపాటుకు గురై మృతి చెందిన ముండ్లమూరు మండలం పసుపు గల్లు గ్రామానికి చెందిన రావుల పల్లి శివ క్రిష్ణ కుటుంబానికి మానవతా స్వచ్చంద సంస్థ చేయూత ఇచ్చింది. వారి తల్లిదండ్రులు రావులపల్లి కుమార్, భవానిల ను ఓదార్చి వారిరి రూ.5వేల నగదు చెక్కును అందించారు. కార్యక్రమంలో సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాస రెడ్డి, కన్వినర్ ధనిరెడ్డి వెంకట రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి వేణు, కోశాధికారి చింతా తిరుపతి రెడ్డి గ్రామ పెద్దలు బిజ్జం క్రిష్ణా రెడ్డి, సుబ్బా రెడ్డి, కోట బ్రహ్మా రెడ్డిలు పాల్గొన్నారు.
