మండల కేంద్రంలో తాళ్లూరు పంచాయితీ ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. కరవది మేజర్ నీటి డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైన్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి, ఇడమకంటి సుబ్బా రెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు అనపర్తి నుబ్బారావు, నాదేండ్ల శ్రీను తదితరులు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో మంచి నీటి దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం తెలిపారు. వేల్ఫేర్ అసిస్టెంట్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
