కంటోన్మెంట్ బొల్లారం ,ఏప్రిల్ 12(జే ఎస్ డి ఎం న్యూస్ )
తెలంగాణా తోటి ,మెహతాబ్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవం ఆదివారం బొల్లారం కొత్త బస్తీ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులుఅర్పించారు.అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్పూర్తితో దళితుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘ సభ్యులను
అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహన్ కన్నన్, కదిర్వన్, వేణుగోపాల్ రెడ్డి, రామ్, బాలరాజు, ప్రేమ్ కిరణ్, శ్యామ్, అమర్ తదితరులు ఉన్నారు.


