తాళ్లూరు మండలంలో ఆదివారం రాత్రి వీచిన భారీ గాలులు, మెరుపులతో విద్యుత్ స్తంభాలు, పంటలు నెలకొరిగాయి. వర్షం కేవలం 1.2 మి.మీల నమోదు అయినప్పుటికి భారీ గాలులతో కోతకు వచ్చిన మొక్కజొన్న, బొప్పాయి, మామిడి, వరి, నువ్వులు, ప్రత్తి కి తీవ్ర నష్టం వాటినట్లయినది. క్షేత్ర స్థాయిలో ఆయా పంటలను వ్యవసాయాధికారి ప్రసాద రావు పరిశీలించారు. చేతికి వచ్చిన మొక్కజొన్న నేలకు వరిగి పోవటంతో ఎకరానికి మరొక ఐదువేలు అదనంగా ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన చెందారు.

అదే విధంగా మండలంలో 30 విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్స్ నెల కొరిగాయి. వాటిని సరిచేసి విద్యుత్ పునరుద్దరణకు విద్యుత్ సిబ్బంది సోమవారం సాయంత్రం వరకు చేమటోర్చారు. చింతల పాలెంలో అధికంగా విత్తుయ్ స్తంభాలు నెలకొరగటంతో విద్యుత్ ఎఈ రామక్రిష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం సాయంత్రానికి విద్యుత్‌ను పునరుద్దరించారు. నాగంబొట్ల పాలెం, లక్కవరం, తాళ్లూరు, తూర్పుగంగవరంలలో కూడ భారీగా స్తంబాలు నెలకొరిగాయి. భారీ ఉరుములతో బీఎన్ఎన్ ఎల్ టవర్ వద్ద కాయిల్స్ కాలిపోవటంతో నెట్ సరఫరాకు అంతరాయం కలగటంతో బీఎన్ఎన్ ఎఈ జెఈ రత్న రాజు ఆధ్వర్యంలో మరమ్మత్తులు చేపట్టారు.